అక్షరటుడే, వెబ్డెస్క్: Birth Death Bill | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును ఆమోదింపజేసుకుంది. సభలో ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం మధ్యే ఎలాంటి సమగ్ర చర్చ జరగకుండానే ‘జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026’ను లోక్‌సభ ఆమోదించింది. పౌరుల జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత సరళతరం , ఆధునీకరించే లక్ష్యంతో ఈ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. దీని ద్వారా డిజిటల్ గవర్నెన్స్ మరింత పటిష్టం కానుంది.
Birth Death Bill | డిజిటల్ రిజిస్ట్రేషన్ ..
ఈ నూతన సవరణ ద్వారా జనన, మరణాల డిజిటల్ రిజిస్ట్రేషన్ విధిగా మారనుంది. అంతేకాకుండా, జాతీయ , రాష్ట్ర స్థాయి డేటాబేస్‌లు ఒకదానితో ఒకటి అనుసంధానం కావడానికి ఈ బిల్లు మార్గం సుగమం చేయనుంది. ఈ డేటా అనుసంధానం ద్వారా ఆధార్, ఓటర్ల జాబితా, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల వంటి పలు కీలక ప్రభుత్వ సేవలు పొందడం పౌరులకు మరింత సులభమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన ఈ బిల్లు, తుది చట్ట రూపం దాల్చడానికి తదుపరి ప్రక్రియలో భాగంగా రాజ్యసభ ఆమోదం కోసం త్వరలో వెళ్లనుంది.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Notice | రాహుల్ గాంధీకి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు.. మోడీ, అమిత్ షాలపై తీవ్ర ఆగ్రహం