Rajasthan Bus Accident | ఎక్స్​ప్రెస్​వేపై బస్సు బోల్తా.. 8 మంది మృతి

రాజస్థాన్​లోని కోటాలో బస్సు బోల్తాపడి 8 మంది మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan Bus Accident | రాజస్థాన్ (Rajasthan)​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటాలో శనివారం తెల్లవారుజామున ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు బోల్తా పడి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.

భోపాల్ నుంచి ఖాటు శ్యామ్‌కు వెళ్తున్న బస్సు కోటా సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ కునుకు తీయడంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొని గుంతలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Rajasthan Bus Accident | ఆస్పత్రికి తరలింపు

గాయపడిన వారిని ఎం.బి.ఎస్ ఆసుపత్రికి, న్యూ మెడికల్ కాలేజీకి తరలించారు. కలెక్టర్ పీయూష్ సమరియా, ఐజీ హరేంద్ర మహావార్ ఆసుపత్రికి చేరుకొని పరిశీలించారు. మృతులలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులను అరుణ, వైష్ణవి, త్రిష, కృష్ణ, అనిత, ఓం, సూర్యవంశీ, రాజుగా గుర్తించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఎవరి పరిస్థితి విషమంగా లేదని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: LK Advani Hospitalized | ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *