Maharashtra Drought Relief | రైతుల కోసం ఐఏఎస్​, ఐపీఎస్ అధికారుల విరాళం

మహారాష్ట్ర రైతుల కోసం ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maharashtra Drought Relief | ఎల్​నినో ప్రభావంతో మహారాష్ట్ర (Maharashtra)లో కరువు తాండవం చేస్తోంది. సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రైతులకు అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు ముందుకు వచ్చారు. అక్టోబర్​ నెలలోని ఓ రోజు జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాష్ట్ర పునరావాస, సహాయక శాఖ అక్టోబర్ 14న 305 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని రైతులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం పలు రాయితీలను కూడా ప్రకటించింది.

Maharashtra Drought Relief | విద్యుత్​ బిల్లుల రాయితీలు

కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు భూమి శిస్తు నుంచి మినహాయింపు కల్పించారు. పంట రుణాలను పునర్​ వ్యవస్థీకరిస్తామని తెలిపారు. అంతేగాకుండా వ్యవసాయ రుణాల వసూళ్లను తక్షణమే నిలిపి వేస్తామని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ బోరు మోటార్ల విద్యుత్ బిల్లుల విషయంలో ప్రత్యేక రాయితీలు కల్పించనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల విద్యార్థులకు పరీక్షా రుసుములను రద్దు చేయనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర రైతుల కోసం అధికారుల సంఘం తమ ఒక రోజు వేతనాన్ని కరువు సహాయ నిధికి జమ చేస్తున్నట్లు లేఖను సమర్పించింది. మరోవైపు ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో భాగస్వాములవుతున్నారు. చిప్లున్-సంగమేశ్వర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శేఖర్ తన నెల వేతనాన్ని అందించారు. కాగా తెలంగాణలో సైతం పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Rajasthan Bus Accident | ఎక్స్​ప్రెస్​వేపై బస్సు బోల్తా.. 8 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *