అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Red Cross Nizamabad | రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని రెడ్‌క్రాస్ ప్రస్తుత ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు కోరారు. నగరం (Nizamabad)లోని మీడియా సమావేశం నిర్వహించారు.
Red Cross Nizamabad | 14మందితో కూడిన ప్యానెల్..
ఆయన మాట్లాడుతూ.. బుస్సా ఆంజనేయులు ప్యానెల్ పేరుతో మొత్తం 14 మంది ప్రస్తుతం పోటీలో ఉన్నామన్నారు. ఈ 14మంది కూడా 15ఏళ్లుగా రెడ్‌క్రాస్‌కు సేవ చేస్తున్నామన్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా రక్తం అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్పందించి రక్తం ఏర్పాటు చేశామన్నారు. రెడ్ క్రాస్ అంటే కేవలం రక్తదాన సేవలకే పరిమితం కాకుండా తలసేమియా వార్డు, వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్ ఇలా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తమ ప్యానెల్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
మొత్తం 14 మంది గెలిస్తేనే తమ ప్యానెల్ అభ్యర్థి ఛైర్మన్ అవుతాడని, రెడ్‌క్రాస్ ద్వారా మరిన్ని సేవలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమ ప్యానెల్లో ఏ.రవీందర్, బి.ఆంజనేయులు, బచ్చబోయిడి గంగ కిషన్, బైరి విజయసాగర్, డి.వెంకటేశం, డొల్ల రాజేశ్వర్ రెడ్డి, గున్నల వెంకటేష్ గౌడ్, కరిపే రవీందర్, కులకర్ణి రమేష్ బాబు, ఎం.శ్రీనివాస్, ఎన్.కృష్ణ, నీరడి వెంకటేశ్వర్లు, సైదు రమేష్, సుధాకర్ నరాల ఉన్నారని వివరించారు. ఈ సభ్యులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నరాల సుధాకర్, కరిపె రవీందర్, రమేష్ బాబు, నీరడి వెంకటేశ్వర్లు, బొబ్బిలి కిరణ్, సందేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gandhi Jayanti Banswada | గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే పోచారం