Dubba Tanda Bridge Issue | ప్రాణాలు పణంగా పెడితేనే అక్షర జ్ఞానం.. నడుములోతు నీటిలో భయం భయంగా పాఠశాలకు విద్యార్థులు!

విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.

Naresh Chandan

అక్షరటుడే, పెద్ద కొడప్‌గల్: Dubba Tanda Bridge Issue | చదువుకోవాలనే ఆశ ఆ చిన్నారులను రోజూ మృత్యువు అంచుల్లోకి నెడుతోంది! బడి గంట మోగితే చాలు, పుస్తకాల సంచులు వీపున వేసుకుని ఆ పిల్లలు చేసేది ప్రయాణం కాదు… బతుకు పోరాటం! కామారెడ్డి Kamareddy జిల్లా పెద్ద కొడప్​గల్​ మండలంలోని కాస్లాబాద్‌ చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు Alugu పారుతుండటంతో కుబ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని దుబ్బతండాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Dubba Tanda Bridge Issue | నడుములోతు నీటిలోనే సాహస యాత్ర

కాస్లాబాద్ చెరువు అలుగు నీరు రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది. దీంతో బడికి వెళ్లాల్సిన పసిపిల్లలు నడుములోతు నీటిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రవాహాన్ని దాటాల్సి వస్తోంది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ఏ క్షణంలో ఏ చిన్నారి కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోతుందోనని తల్లిదండ్రులు గుండెలు చేతపట్టుకుని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో నీటి ప్రవాహం మరింత పెరిగి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని తండావాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Telangana Employee DA Release | ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

Also Read : Telangana TG TMARS Bureau | రోడ్లు, రైలు ప్రయాణాలు ఇక మరింత సురక్షితం..తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ‘TG TMARS’ బ్యూరో ఏర్పాటు!

akshara today .jpgcheruvu

Dubba Tanda Bridge Issue | శాశ్వత వంతెన నిర్మించాల్సిందే!

పసిపిల్లల భవిష్యత్తును, ప్రాణాలను పణంగా పెట్టి సాగిస్తున్న ఈ ప్రమాదకర ప్రయాణానికి వెంటనే ముగింపు పలకాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేస్తూ వెంటనే కల్వర్టు లేదా ఎత్తైన వంతెన (బ్రిడ్జి) నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Dubba Tanda Bridge Issue | పరిశీలించిన తహశీల్దార్ రాజశేఖర్

విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. రహదారిపై పారుతున్న అలుగు నీటిని చూసి, బ్రిడ్జి నిర్మాణం కోసం వెంటనే ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తండా వాసులకు హామీ ఇచ్చారు. వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే రాకపోకలు సాగించాలని, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సిబ్బందిని ఆదేశించారు.

ఏళ్ల తరబడి సాగుతున్న ఈ నరకయాతనకు అధికారులు, పాలకులు స్పందించి తక్షణమే వంతెన పనులు ప్రారంభించాలని, ప్రమాదం జరగకముందే మేల్కోవాలని దుబ్బతండా ప్రజలు వేడుకుంటున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *