అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Liquor Shop Notification | ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మిగిలిపోయిన మొత్తం 807 ఏ4 మద్యం షాపులకు సంబంధించి లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP Liquor Shop Notification | 3,650 ఏ4 షాపుల రెన్యువల్‌కు అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్ ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. ఆ గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది. ఇందులో 3,236 మద్యం షాపుల యజమానులు తమ లైసెన్సులను విజయవంతంగా రెన్యువల్ చేసుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల 414 షాపుల యజమానులు రెన్యువల్‌కు ముందుకు రాలేదు.
గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన దుకాణాలతో పాటు, ప్రస్తుతం రెన్యువల్ కాకుండా మిగిలిన 414 షాపులను కలుపుకొని మొత్తం 807 మద్యం షాపులకు ప్రభుత్వం తాజాగా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది.
AP Liquor Shop Notification | దరఖాస్తుల షెడ్యూల్ ఇలా..
- దరఖాస్తుల ముగింపు: అక్టోబరు 1 అర్ధరాత్రి వరకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
- పరిశీలన తేదీ: సమర్పించిన దరఖాస్తులను అక్టోబరు 3న అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
- కేటాయింపు విధానం: దరఖాస్తుల పరిశీలన అనంతరం లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపులను కేటాయిస్తారు.
ఈ నూతన నోటిఫికేషన్‌తో మిగతా షాపుల ద్వారా కూడా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం రానుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.