అక్షరటుడే, వెబ్డెస్క్ : Palnadu Road Accident | ఏపీలోని పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు.
బోయపాలెం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు మరణించారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న ఒక లారీ, సెంట్రల్ డివైడర్ను దాటి, ఎదురుగా చిలకలూరిపేట వైపు వస్తున్న మరో లారీని ఢీకొట్టింది.
Palnadu Road Accident | మంటలు చెలరేగడంతో..
ఈ ఘటనతో భారీ మంటలు చెలరేగి, నిమిషాల వ్యవధిలోనే రెండు వాహనాలూ పూర్తిగా వ్యాపించాయి. ఒక లారీ రాళ్లను తరలిస్తుండగా, మరొకటి కాగితాల సరుకును తీసుకువెళుతోంది. దీంతో అందులోని డ్రైవర్లు, క్లీనర్లు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి వేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవదహనం
ఏపీలోని పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇద్దరు డ్రైవర్లు,… pic.twitter.com/OZGG0WqMdu
— Akshara Today | Telugu News (@aksharatoday) July 1, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad Police Firing | హైదరాబాద్లో కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు ఫైరింగ్ చేసిన పోలీసులు