అక్షరటుడే వెబ్‌డెస్క్: Commercial LPG Price | దేశంలోని వ్యాపార వర్గాలకు , విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ సంస్థలు కలిసి శుభవార్త అందించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల స్థిరీకరణ , భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడటంతో ఇంధన ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి.
Commercial LPG Price | హోటళ్లు, రెస్టారెంట్లకు ఉపశమనం..
వ్యాపార వినియోగదారులకు ఊరటనిస్తూ, 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ ( LPG )సిలిండర్ ధరపై రూ. 183.50 తగ్గింపును ప్రకటించారు. ఈ తాజా ధరల తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,930కి తగ్గింది. అలాగే, చిన్న వ్యాపారులకు ఉపయోగపడే 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 13 తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సేవలు , చిన్న తరహా వ్యాపారాల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గనుంది. అయితే, గృహ వినియోగదారులకు మాత్రం ఈసారి ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ల ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Commercial LPG Price | విమానయాన రంగానికి మేలు..
తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి కూడా ఈ ధరల తగ్గింపు ఎంతో మేలు చేయనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరను లీటరుకు రూ. 5 మేర తగ్గించారు. విమాన సంస్థల నిర్వహణ ఖర్చులలో దాదాపు 35% నుండి 40% వరకు ఇంధనానికే ఖర్చవుతుంది. ఈ ధరల తగ్గింపు వల్ల విమాన సంస్థల ఆపరేటింగ్ ఖర్చులు తగ్గి, భవిష్యత్తులో విమాన టికెట్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Palnadu Road Accident | రెండు లారీలు ఢీ.. నలుగురు సజీవదహనం