Banswada Journalist Training | బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు జోరుగా ఏర్పాట్లు

బాన్సువాడ పట్టణంలో ఈనెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం పరిశీలించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Journalist Training | పట్టణంలో (Banswada) ఈనెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతుల (Journalist Training) ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం గురువారం పరిశీలించింది. తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యుజే ఐజేయు సంయుక్త ఆధ్వర్యంలో దేశాయిపేటలోని ఎస్ఆర్ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.

Banswada JournaBanswada Journalist Training | list Training | మీడియా అకాడమీ ప్రతినిధులు..

ఈ నేపథ్యంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రెహమాన్, మేనేజర్, జిల్లా యూనియన్ అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సెమినార్ హాల్, లంచ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. శిక్షణకు హాజరయ్యే జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్‌కు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచే విధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 120 మంది జర్నలిస్టులకు శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణకు హాజరయ్యే వారికి అవసరమైన మెటీరియల్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వర్క్‌షాప్ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

12 14

ఇది కూడా చదవండి: బాలాపూర్ లడ్డూ రూ.450తో మొదలై.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *