అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 25 Market Analysis | పశ్చిమాసియా (West Asia) లో జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లపైకి చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sep 25 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
నాస్డాక్ 0.01 శాతం లాభంతో, ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం నష్టంతో ఉంది.
Sep 25 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.52 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.57 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.24 శాతం నష్టపోయాయి.
Sep 25 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 1.15 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.96 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.24శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.01 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. తైవాన్, సౌత్ కొరియా మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.03 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 5,027 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 32 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 4,301 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు బలహీనపడి 95.96 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.24 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.19 శాతం వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.80 డాలర్ల వద్ద ఉంది.