Oct 28 Market Analysis | నెగెటివ్​గా గిఫ్ట్ నిఫ్టీ.. నష్టాలతో ప్రారంభ కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 28 Market Analysis | యూఎస్ (US) ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది. దీనికి ముందు సెషన్‌లో ఏఐ-ఆధారిత టెక్ స్టాక్స్‌లో కొనుగోళ్లతో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI స్టాక్స్ మద్దతుతో బుధవారం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలో సాగుతున్నాయి. క్రూడ్ ఆయిల్(Crude oil) ధరలు గరిష్టాల వద్ద కొనసాగుతుండడంతో మన మార్కెట్లు మాత్రం ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Oct 28 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

చిప్‌మేకర్ స్టాక్స్ లాభాలకు నాయకత్వం వహించడంతో వాల్ స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.18 శాతం, ఎస్ అండ్ పీ 0.60 శాతం లాభపడగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో ఉంది.

Oct 28 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.70 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.50 శాతం లాభపడగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.76 శాతం నష్టాలతో ముగిశాయి.

Oct 28 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.72 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.40 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.15 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.20 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.10 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.08 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.96 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 4,240 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు ఐదో సెషన్ý తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,250 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 95.11 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 115.71 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.40 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.03 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.11 నుంచి 1.06 కు తగ్గింది.

    విక్స్ 4.41 శాతం తగ్గి 16.4 వద్ద ఉంది.

  • రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టవనున్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఒక ముఖ్యమైన రోజుగా నిలవనుంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *