అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lumino Industries IPO | కండక్టర్లు, పవర్ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్లు మరియు ప్రత్యేక భాగాల తయారీ, సరఫరా చేసే ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) కంపెనీ లూమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 700 కోట్లు సమీకరించింది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 6,09,75,609 షేర్లను విక్రయించి రూ. 500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 5 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,43,90,242 షేర్లను విక్రయించి మరో రూ. 200 కోట్లు పొందింది.
Lumino Industries IPO | భారీ డిమాండ్..
లూమినో ఇండస్ట్రీస్ ఐపీవో (IPO) సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 27న ఓపెన్ అయి, ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంది. ఈ ఇష్యూకు ఇన్వెస్టర్లనుంచి భారీ డిమాండ్ లభించింది. మొత్తం ఐపీవో 124.02 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 232.79 రెట్లు, ఎన్ ఐఐ కోటా 185.21 రెట్లు, రిటైల్ కోటా 40.27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
Lumino Industries IPO | లాభాల పంట..
లూమినో ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లను నిరాశపరచలేదు. మంచి లాభాలతో స్టాక్ మార్కెట్‌లో ఆరంగేట్రం చేసింది. కంపెనీ ఒక్కో షేరును రూ. 82 కి విక్రయించáగా.. రూ. 110 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 34.15 శాతం లాభాలు వచ్చాయి. ఇంట్రాడేలో రూ. 106.54 వద్ద కనిష్టాన్ని నమోదు చేసిన కంపెనీ షేర్లు.. రూ. 118.99 వద్ద ఆల్‌టైం హైకి చేరాయి. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో షేరు ధర తగ్గింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 33.54 శాతం ప్రీమియంతో రూ. 110.32 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి..: Sep 03 Gold Prices | అమెరికా ఉద్యోగ గణాంకాలపై బులియన్ మార్కెట్ చూపు.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..