Stock Market Rally | భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 905 పాయింట్లు, నిఫ్టీ 238 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో విదేశీ సంస్థాగత మదుపరులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం, పదేళ్ల అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ సైతం దిగివస్తుండడంతో దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. దీంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది.

Stock Market Rally | ఫ్లాట్‌గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 87 పాయింట్లు తగ్గింది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడే కనిష్టాలనుంచి 985 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 34 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 305 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 905 పాయింట్ల లాభంతో 74,151 వద్ద, నిఫ్టీ 238 పాయింట్ల లాభంతో 22,936 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | ఆటో సెక్టార్ మినహా..

ఆటో సెక్టార్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు రాణించాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.24 శాతం నష్టపోయింది. ఎఫఎంసీజీ, యుటిలిటీ, రియాలిటీ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగా పెరిగాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌తోపాటు పవర్, ఐటీ, కన్జూమర్ డ్యూరెబుల్ , టెలికాం, మీడియా స్టాక్స్ రాణించాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,654 కంపెనీలు లాభపడగా 1,716 స్టాక్స్ నష్టపోయాయి. 218 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 93 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 161 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో, 4 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీపోర్ట్స్ 5.17 శాతం, కొటక్ బ్యాంక్ 3.86 శాతం, పవర్‌గ్రిడ్ 3.70 శాతం, ఎటర్నల్ 3.46 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.56 శాతం లాభపడ్డాయి.

Losers : ట్రెంట్ 1.44 శాతం, మారుతి 1.00 శాతం, టెక్ మహీంద్రా 0.20 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.13 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Alphabet Share Price | మెప్పించని ఫలితాలు.. పడిపోయిన గూగుల్ షేర్లు.. రూ.26 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *