Alphabet Share Price | మెప్పించని ఫలితాలు.. పడిపోయిన గూగుల్ షేర్లు.. రూ.26 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

ఆల్ఫాబెట్ కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరాశ పరిచాయి. దీంతో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపద రూ. 26 లక్షల కోట్ల మేర తగ్గింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Alphabet Share Price | అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మÖడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇవి వాల్‌స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఫలితంగా బుధవారం అమెరికా మార్కెట్లలో ఆల్ఫాబెట్ షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమయ్యాక సుమారు 11 శాతం పతనమయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో 280 బిలియన్ డాలర్ల సంపద ఆవిరయ్యింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 26 లక్షల కోట్లు.

Alphabet Share Price | ఆదాయం పెరిగినా..

మూడో త్రైమాసికంలో ఆల్ఫాబెట్‌కు గూగుల్ క్లౌడ్ విభాగం నుంచి వచ్చిన ఆదాయం 30.7 బిలియన్ల డాలర్లకు చేరింది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ విభాగాల ఆదాయంలో వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోయినా క్లౌడ్ ఆదాయంతో సర్దుబాటు అయ్యింది. కంపెనీ మొత్తం ఆదాయంలో వృద్ధి కనిపించినా.. నికర లాభాలు, ఈపీఎస్ అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడుల నష్టాలు, భారీ ఖర్చుల కారణంగా నికర లాభం 25 శాతం తగ్గి రూ. 26.2 బిలియన్లకు పడిపోయింది. ఈపీఎస్ అంచనా 3.02 డాలర్లు కాగా.. 2.12 డాలర్లుగానే నమోదైంది.

Alphabet Share Price | ఏఐపై భారీ పెట్టుబడులతో ఆందోళన..

ఏఐ, క్లౌడ్ సదుపాయాలను విస్తరించేందుకు ఆల్ఫాబెట్ భారీగా ఖర్చుచేస్తోంది. దీంతో ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో సమీపకాలంలో లాభాలు వస్తాయో లేదోనన్న ఆందోళనలతో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఏఐ సేవలకు భారీగా డిమాండ్ ఉన్నా.. పెరుగుతున్న ఖర్చులతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. దీంతో ఆల్ఫాబెట్ షేర్లు భారీ సెల్లాఫ్‌కు గురయ్యాయి.దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic stock market)లో బుధవారం లిస్టయిన జియో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13 లక్షల కోట్లు కాగా.. గూగుల్ మాతృ సంస్థ ఆర్థిక ఫలితాలు నిరాశ పరచడంతో ఆ కంపెనీ కొన్ని గంటల్లోనే కోల్పోయిన మార్కెట్ విలువ రూ. 26 లక్షల కోట్లు కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి..:  Indian Stock Market | లాభాల్లో ప్రధాన సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *