Shiprocket IPO | బంపర్ లిస్టింగ్.. భారీ లాభాలను అందించిన షిప్ రాకెట్ ఐపీవో

షిప్‌రాకెట్ కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. అంచనాలకు అనుగుణంగానే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiprocket IPO | దేశంలోని ఎంఎస్ఎంఈలు, పెద్ద రిటైలర్లు సులభంగా ఆన్‌లైన్ వర్తకం చేయడానికి ఉపయోగపడే ఎండ్ టు ఎండ్, ఏపీఐ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫాం అయిన షిప్ రాకెట్ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 1,617.48 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 885.50 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 731.98 కోట్లు సమీకరించింది.

Shiprocket IPO | భారీ స్పందన..

షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. ఇష్యూ మొత్తం 102 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 122 రెట్లు, ఎన్ ఐఐ కోటా 92.58 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 48.38 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

Shiprocket IPO | 35 శాతం లాభాలు..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 97 గా నిర్ణయించింది. బుధవారం రూ. 131 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దీనితో ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 35 శాతం లాభాలు వచ్చాయి. ఇంట్రాడేలో రూ. 144 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేశాయి. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో 40 శాతం ప్రీమియంతో రూ. 137 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Behari Lal Engineering IPO | దుమ్మురేపిన ఐపీవో.. తొలిరోజే భారీ లిస్టింగ్ గెయిన్స్ అందించిన కంపెనీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *