అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Gains | అమెరికా -ఇరాన్ మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ క్రూడ్ ఆయిల్ ధర కాస్త తగ్గడం మార్కెట్‌కు ఉపశమనం కలిగించింది. యూఎస్ జాబ్ డేటా అంచనాల కంటే బలహీనంగా రావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే విషయంలో అగ్రెసివ్‌గా వెళ్లకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లనుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ సైతం పాజిటివ్‌గా సాగింది. వరుసగా నాలుగు సెషన్ల పాటు భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. సోమవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి.
Stock Market Gains | లాభాల స్వీకరణతో ఒడిదుడుకులు..
నూతన వారాన్ని పాజిటివ్‌గా ప్రారంభించిన ప్రధాన సూచీలు.. అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు కఠినంగా సాగుతున్నాయంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో ఇంట్రాడేలో ఒత్తిడికి గురయ్యాయి. ఇప్పట్లో ఒప్పందం కుదిరే అవకాశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనికితోడు యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర పెట్టుబడుల ఉపసంహరణ, జియో పొలిటికల్ టెన్షన్స్ వంటి అంశాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
Stock Market Gains | గ్యాప్ అప్ లో ప్రారంభమై..
దేశీయ మార్కెట్లు (Domestic Markets) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 289 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 791 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 89 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 224 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మార్కెట్ కోలుకుని పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద, నిఫ్టీ 134 పాయింట్ల లాభంతో 22,555 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,118 కంపెనీలు లాభపడగా 2,372 స్టాక్స్ నష్టపోయాయి. 270 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 144 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 207 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఐటీసీ 4.49 శాతం, ఎటర్నల్ 2.50 శాతం, ఎయిర్టెల్ 2.38 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.28 శాతం, అదానీ పోర్ట్స్ 2.13 శాతం లాభపడ్డాయి.
Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 3.69 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.99 శాతం, సన్‌ఫార్మా 1.55 శాతం, ఇన్ఫోసిస్ 1.50 శాతం, ఆసియన్ పెయింట్ 1.43 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Orient Cables IPO | లిస్టింగ్‌లో అ‘ధర’గొట్టిన ఓరియంట్ కేబుల్స్.. ప్రారంభంలోనే 65 శాతం లాభాలు