July 30 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 30 Market Analysis | యూఎస్ -ఇరాన్‌ Iran ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్(Crude oil) ధర మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా స్పందిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్(Sensex), నిఫ్టీ గురువారం బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

July 30 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

నాస్‌డాక్ 1.74 శాతం, ఎస్ అండ్ పీ 1.52 శాతం పడిపోయాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని పెట్టుబడిదారులు అంచనా వేయడంతో, బుధవారం రాత్రి యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.28 శాతం లాభంతో ఉంది.

July 30 Horoscope | రాశుల వారీగా నేటి ఫలాలు తెలుసుకుందామా!

July 30 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.34 శాతం లాభపడగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.60 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.01 శాతం నష్టపోయాయి.

July 30 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.43 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.75 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.18 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.06 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.63 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.35 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.38 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,981 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

  • డీఐఐలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 998 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 95.64 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.92 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.68 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.05 నుంచి 1.18 కు పెరిగింది.
  • విక్స్ 4.42 శాతం తగ్గి 12 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 89.38 డాలర్ల వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *