KTR Ramappa Temple | భూముల దోపిడీ అయిపోయింది .. ఇప్పుడు భూగర్భ సంపదా?: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

భూములు దోచుకోవడం పూర్తయిపోయిందని, ఇప్పుడు భూగర్భ సంపదను కాజేస్తూ చారిత్రక కట్టణాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Ramappa Temple | భూములు దోచుకోవడం పూర్తయిపోయిందని, ఇప్పుడు భూగర్భ సంపదను కాజేస్తూ చారిత్రక కట్టణాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి  (  Revanth Reddy ) ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న ఏకైక చారిత్రక కట్టడమైన రామప్ప దేవాలయం సమీపంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్న వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

KTR Ramappa Temple | వారసత్వ సంపదకు ముప్పు..

రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దారుణమని కేటీఆర్ అన్నారు. భారీ స్థాయిలో లోతుగా తవ్వకాలు జరపడం, పేలుళ్లు (బ్లాస్టింగ్స్) చేయడం వల్ల తెలంగాణ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప ఆలయానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

KTR Ramappa Temple | పెద్ద ఎత్తున ఉద్యమం..

మన చారిత్రక వారసత్వ సంపదను నాశనం చేసే ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. రామప్ప దేవాలయానికి ముప్పు తెచ్చే ఈ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:  Praja Vani Complaints | ప్రజావాణిలో నమోదైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *