Praja Vani Complaints | ప్రజావాణిలో నమోదైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత..

ప్రజావాణిలో ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు అధికారులకు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Praja Vani Complaints | ప్రజావాణి (Prajavani)లో ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు అధికారులకు సూచించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

Praja Vani Complaints | ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాలి..

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని అదనపు కలెక్టర్​ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 107 ఫిర్యాదులు అందాయని వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్ రావు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్​లు స్వీకరించారు.

Praja Vani Complaints | ఆర్టీఐ చట్టంపై విస్తృతస్థాయిలో అవగాహన..

సమాచార హక్కు చట్టం వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. ప్రజావాణి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈనెల 5 నుండి 12వ తేదీ వరకు ఆర్టీఐ వారోత్సవాలను అన్ని స్థాయిలలో నిర్వహిస్తూ, సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rice Prices Rise | బియ్యం ధరలకు రెక్కలు.. సామాన్యులకు చుక్కలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *