Giridarshak Recruitment Telangana | మావోయిస్టుల నిర్మూలనకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. గిరిదర్శకుల నియామకం!

Naresh Chandan
Giridarshak Recruitment Telangana

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Giridarshak Recruitment Telangana | అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి మావోయిస్టులను సమాజంలో భాగస్వామ్యం చేయాలన్న వినూత్న ఆలోచనతో తెలంగాణ సర్కారు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో 20 మంది మాజీ మావోయిస్టు గిరిజన యువతను గిరిదర్శకులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తొలి విడతగా ఎంపిక చేసిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు.

Giridarshak Recruitment Telangana | పర్యాటక శాఖ ఆధ్వర్యంలో..

భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు భూమిపూజ నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది గిరిజన యువతకు ఈ నియామక పత్రాలను అందించారు. వారికి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో శిక్షణ ఇచ్చి వారిని గిరిదర్శక్ (టూరిస్ట్ గైడ్) లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొనసాగించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యంగా పోలీసు, గిరిజనాభివృద్ధి, పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలోని పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు సహాయపడేలా శిక్షణనిచ్చారు.

Giridarshak Recruitment Telangana | ఈ జిల్లాల్లో విధులు..

తొలి విడతగా ఎంపిక చేసిన 20 మంది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సహాయంగా ఈ గిరిదర్శక్‌లు పనిచేస్తారు. పర్యాటకులకు వారు స్థానిక సంస్కృతి, చరిత్రను వివరిస్తారు. అటవీ నియమాలు పాటించేలా చూడటంతో పాటు పర్యాటకులకు అవసరమైన భద్రత కల్పించడంలో ఈ గిరిదర్శక్‌లు సహాయంగా నిలుస్తారు.

గిరిజన యువతను సమాజంలో భాగస్వామ్యం చేయడం, వారిలో మనోధైర్యం కల్పించాలన్న సంకల్పంతో సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేయడం, గతంలో తీవ్రవాద ప్రభావం ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో వారిని ఆ ప్రాంతంలో నియమించారు.

గిరిదర్శకులుగా ఎంపిక చేసిన వారికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 6 నెలల పాటు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని, శిక్షణ కాలంలో వారికి స్కాలర్‌షిప్ అందించాలని చెప్పారు.

UAE OPEC Exit : ఓపెక్‌కు షాక్.. 50 ఏళ్ల తర్వాత యూఏఈ వైదొలగింపు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *