Sampally Canal Encroachment | ప్రజాప్రతినిధి కుటుంబీకుల ఆగడాలు.. సాంపల్లి చెరువు అలుగు కాలువ కబ్జాకు యత్నం.. గ్రామస్థుల ఆందోళన!

Naresh Chandan
Sampally Canal Encroachment

అక్షరటుడే, డిచ్​పల్లి: Sampally Canal Encroachment | కొన్ని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలో వెలుగుచూసింది.

Sampally Canal Encroachment | బెదిరింపులు..

డిచ్​పల్లి మండలం సాంపల్లి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారు. ఏకంగా చెరువు అలుగు కాలువనే కబ్జా చేస్తున్నారు. ట్రాక్టరుతో అదే చెరువు మట్టిని తెచ్చి కాలువను పూడ్చి వేస్తుండటం గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదే విషయమై సదరు ప్రజాప్రతిధిని అడిగితే.. అలుగు కాలువ స్థలం తాము కొనుగోలు చేశామని, అందుకే పూడుస్తున్నట్లు ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు.

Sampally Canal Encroachment | అలుగు నీరు పారేదెలా..

సాంపల్లి రైతులకు పెద్ద దిక్కుగా సామ్ చెరువు పూర్వ కాలం నుంచి ఆదుకుంటోంది. అలుగు పారే కాలువ స్థలoలో… ప్రస్తుతం ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పూడ్చి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో చెరువు నిండితే అలుగు నీరు పారేదారి లేక.. పంట పొలాల్లోకి ప్రవహించే ప్రమాదం పొంచి ఉందని ఆయకట్టు అన్నదాతలు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Sampally Canal Encroachment | ఉపాధిహామీ పనుల మట్టి వాడకం:

ఉపాధిహామీ పథకంలో భాగంగా చెరువులో కూలీల ద్వారా తీసిన మట్టిని ట్రాక్టర్లల్లో నింపి అవసరమైన రైతుల పొలాల్లో పోయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉపాధిహామీ పనుల్లో కూలీలతో తీయించిన మట్టిని అధికార బలం చూసుకుని అలుగు పారే కాలువలో పోస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధిహామీ పనుల ద్వారా తవ్విన మట్టితో అలుగు కాలువ పూడుస్తున్నా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

గ్రామంలో ఎలాంటి ఘటన జరిగినా ఇట్టే స్పందించే వీడీసీ కమిటీ సభ్యులు కూడా ఈ విషయంలో మౌనం పాటించడం వెనుక ఏదో మర్మం దాగి ఉందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

వీడీసీ కమిటీలో సదరు ప్రజాప్రతినిధి కుటుంబంలోని ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ అన్నింట్లోనూ పెత్తనం చెలాయించడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. వీడీసీ కమిటీ సభ్యులు గ్రామంలో కొందరికి వత్తాసు పలుకుతున్నట్లు విమర్శిస్తున్నారు.

చెరువు అలుగు గ్రామానికి సంబందించిన అంశమని, పక్కనున్న భూములకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, దీనిపై వీడీసీ, గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆలోచించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Giridarshak Recruitment Telangana | మావోయిస్టుల నిర్మూలనకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. గిరిదర్శకుల నియామకం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *