అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Red Cross Society | రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా పోతన్కర్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, డీసీవో శ్రీనివాస్ పాలకవర్గంతో సోమవారం రెడ్‌క్రాస్ సొసైటీ లో ప్రమాణస్వీకారం చేయించారు.
Red Cross Society | కార్యవర్గమిదే..
రెడ్‌క్రాస్ వైస్ ఛైర్మన్‌గా డాక్టర్ సీనునాయక్, ట్రెజరర్‌గా కెంపుల నాగరాజు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జెస్సు అనిల్ ఎన్నికయ్యారు. మొత్తంగా 15మందితో సొసైటీ పాలవకర్గం ఏర్పడింది. నగరంలోని హరిచరణ్ మార్వాడీ విద్యాలయం (Haricharan Marwari School)లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. 29 మంది అభ్యర్థులు రెండు ప్యానెళ్లుగా విడిపోయి పోటీ చేశారు. బుస్సా ఆంజనేయులు ప్యానెల్లో 14మంది పోటీపడగా నలుగురు విజేతలుగా నిలిచారు. అలాగే ఇందూరు సేవాసమితి ప్యానెల్లో 15మంది పోటీలో ఉండగా 11మంది గెలిచారు.
ఇది కూడా చదవండి: Tallarampur VDC Action | తాళ్లరాంపూర్ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలి..