Sand Transport | అధికారిక అనుమతులతోనే ఇసుక రవాణా.. స్పష్టం చేసిన​ వీడీసీ

బడాభీమ్‌గల్ గ్రామ సమీపంలోని కప్పల వాగు నుంచి అధికారిక అనుమతులతోనే ఇసుక రవాణా సాగుతోందని వీడీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్ : Sand Transport | బడా భీమ్‌గల్(Bada Bheemgal) గ్రామ సమీపంలోని కప్పల వాగు నుంచి ఇసుక(Sand) రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, అధికారిక అనుమతులతోనే సాగుతోందని వీడీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం కప్పలవాగు(Kappala Vagu ) వద్ద గ్రామానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల స్థానిక నాయకులతో కలిసి వారు సమావేశం నిర్వహించారు.

Sand Transport | నిరాధార ఆరోపణలు

వీడీసీ (VDC) ప్రతినిధులు మాట్లాడుతూ.. కప్పలవాగు ఇసుక రవాణాపై కొందరు నియోజకవర్గ, జిల్లాస్థాయి నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. గ్రామంలో ఇసుక రవాణా అంతా వీడీసీ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్‌లైన్ ద్వారా డీడీలు చెల్లించి, సంబంధిత అధికారుల అనుమతులతోనే రవాణా సాగిస్తున్నామని వివరించారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని, దీనికి ఏ రాజకీయ పార్టీతోనూ ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకే కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలతో బడా భీమ్‌గల్ గ్రామం ప్రతిష్ఠను దిగజార్చడం సరికాదన్నారు.

Sand Transport | అసత్యప్రచారాలు మానుకోవాలి

ఇప్పటికైనా గ్రామంపై, ఇసుక రవాణాపై అసత్య ప్రచారాలను తక్షణమే నిలిపివేయాలని వీడీసీ సభ్యులు కోరారు. భవిష్యత్తులో సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా గ్రామంపై తప్పుడు ఆరోపణలు చేస్తే గ్రామస్తులంతా ఏకమై తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల సంజీవ్, నాయకులు మోర్తాడ్ లింబాద్రి, రాగుల మోహన్, శ్రీధర్ గౌడ్, వెల్దుర్తి కిషన్, గట్టు సతీష్, చింతకింది భూమేశ్వర్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: July 26 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *