అక్షరటుడే, వెబ్డెస్క్: Imran Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. సీజేపీ నిరసనల్లో పాల్గొన్న తర్వాత ఆయనకు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ అమెరికా (America) పౌరసత్వం కలిగి ఉన్నాడు. భారత పౌరుడు కానప్పటికీ, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇమ్రాన్ ఖాన్పై ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.ఆయన వద్ద పూర్తి స్థాయి భారతీయ పౌరసత్వం లేదు. ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ (OCI) కార్డు మాత్రమే ఉంది.
Imran Khan | సీజేపీ నిరసనల్లో..
ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్లో అక్టోబర్ 10న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు నటి లేఖా వాషింగ్టన్, కజిన్ జైన్ మేరీ ఖాన్ కూడా నిరసనలో ఉన్నారు. ఆ రోజు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 నిబంధనల ప్రకారం దీనిని జారీ చేశారు. సెక్షన్ 7 ప్రకారం, భారత్లోకి విదేశీయుల ప్రవేశం, నిష్క్రమణ, వారి ఉనికి లేదా కదలికలను నియంత్రించడానికి, పరిమితం చేయడానికి, నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి..: Pakistan Drone Weapons | రాజస్థాన్లో డ్రగ్స్, ఆయుధాలు జారవిడిచిన పాక్ డ్రోన్లు