May 05 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్ ను గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan
May 05 Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 05 Market Analysis | దక్షిణ కొరియాకు చెందిన నౌక Strait of Hormuz లో పేలుడుకు గురికావడంతో ఆందోళన నెలకొంది. దీంతో గత సెషన్ లో వాల్ స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. యÖ రోపియన్ మార్కెట్లు సైతం నష్టపోయాయి.

ప్రధాన ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం సైతం ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

May 05 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.20 శాతం, ఎస్ అండ్ పీ 0.41 శాతం తగ్గాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం లాభంతో ఉంది.

May 05 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.74 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.26 శాతం నష్టపోయాయి.

May 05 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.96 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.28 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.22 శాతం నష్టంతో ఉన్నాయి. జపాన్ , చైనా, సౌత్ కొరియాలలో పబ్లిక్ హాలిడే కారణంగా అక్కడి స్టాక్ మార్కెట్ లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం లాభంతో సాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐ(FII)లు తొమ్మిది సెషన్ల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,835 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,764 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.98 నుంచి 0.80 కు తగ్గింది.
  • విక్స్ 0.87 శాతం తగ్గి 18.30 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 113.37 డాలర్లకు చేరింది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.49 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.44 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి 95.08 వద్ద ఉంది.

Iran UAE drone attack | ఫుజైరా ఆయిల్ హబ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *