జాతీయంKalita Majhi MLA | పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ విజయం

Kalita Majhi MLA | పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ విజయం

సాధారణ స్థితి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన కలితా మాఝీ విజయం, ప్రజాస్వామ్యంలో అవకాశాల సమానత్వానికి నిదర్శనంగా భావిస్తున్నారు. స్థానిక సమస్యలపై పోరాడే నిబద్ధతతోనే ఈ విజయం సాధ్యమైందని తన అనుచరులు పేర్కొంటున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kalita Majhi MLA | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అతిసాధారణ జీవితం గడిపే ఓ పనిమనిషి ఎమ్మెల్యేగా గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆస్గ్రామ్ (SC) నియోజకవర్గం నుంచి Kalita Majhi (37) అనే మహిళ Bharatiya Janata Party తరఫున పోటీ చేసి భారీ విజయం నమోదు చేసుకున్నారు.

తన ప్రత్యర్థి All India Trinamool Congress అభ్యర్థిపై దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కలితా మాఝీ సాధించిన మొత్తం ఓట్లు 1,07,692. ఆమె విజయంతో స్థానికంగా ఆనందోత్సాహాలు మిన్నంటాయి.

Kalita Majhi MLA | దుర్భర జీవితం..

గత రెండు దశాబ్దాలుగా కలితా సంపాదన నెలకు సుమారు రూ.2,500 మాత్రమే. 3–4 ఇళ్లలో పాత్రలు కడగడం, వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కలితా మాఝీ తాజాగా చరిత్రను తిరగ రాశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా తన రోజువారీ పనులను కొనసాగిస్తూనే.. ప్రజల మధ్య ప్రచారం కొనసాగించడం ప్రత్యేకతగా నిలిచింది.

సాధారణ స్థితి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన కలితా మాఝీ విజయం, ప్రజాస్వామ్యంలో అవకాశాల సమానత్వానికి నిదర్శనంగా భావిస్తున్నారు. స్థానిక సమస్యలపై పోరాడే నిబద్ధతతోనే ఈ విజయం సాధ్యమైందని తన అనుచరులు పేర్కొంటున్నారు.

May 05 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్ ను గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

POCSO case verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి జీవితఖైదు

అక్షరటుడే, కామారెడ్డి: POCSO case verdict | పోక్సో కేసులను కామారెడ్డి...

Bhu Bharati server down | భూ భారతి సర్వర్​ డౌన్​.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu Bharati server down | రాష్ట్రంలో...

Beedi Thekedars | డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలి.. బీడీ టేకేదార్ల డిమాండ్

అక్షరటుడే, కామారెడ్డి: Beedi Thekedars | చార్ బై కంపెనీ నుంచి...

Shabbir Ali | అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం..: షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో దుకాణాలు కోల్పోయిన...