Gold Price Today | అతివ‌ల‌కి అదిరిపోయే న్యూస్‌.. పసిడి ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price Today | భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి. పండుగలు, శుభకార్యాలు, ముఖ్యంగా పెళ్లిళ్లు అంటే బంగారం కొనుగోలు తప్పనిసరి అనే భావన ఉంది. అంతేకాక కష్టకాలంలో ఆదుకునే భరోసాగా కూడా బంగారం నిలుస్తుంది.

అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు (Gold Prices) నిరంతరం పెరుగుతూ సామాన్యులపై భారంగా మారాయి. ఒక్క ఏడాదిలోనే సుమారు లక్ష రూపాయల వరకు పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో మంగళవారం బంగారం ధరలు కొంతమేర తగ్గడం వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో ఈ మార్పు కొనుగోలుదారులకు అనుకూలంగా మారిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Gold Price Today | హైదరాబాద్‌లో ధరలు ఇలా ..

ప్రస్తుతం హైదరాబాద్‌ (Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,49,610 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,49,620గా ఉండేది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,37,140గా ఉంది. ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.2,69,900గా ఉంది. నిన్న ఇది రూ.2,70,000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. తగ్గుదల పెద్దగా కాకపోయినా, ధరల పెరుగుదలకు తాత్కాలిక విరామం లభించడం విశేషంగా భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,760గా ఉంది. నిన్న ఇది రూ.1,49,770గా ఉండేది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,290గా నమోదైంది.

Gold Price Today | బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం

చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,720గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,990గా ఉంది. కర్నాటకలో హైదరాబాద్ ధరలే కొనసాగుతుండగా, వెండి ధరల విషయంలో ఢిల్లీలో కొంత తక్కువగా ఉంది. అక్కడ కిలో వెండి రూ.2,64,900గా ఉండగా, చెన్నైలో రూ.2,69,900గా నమోదైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. అయితే అంతర్జాతీయ మార్కెట్ మార్పులపై ఆధారపడి ధరలు మళ్లీ మారే అవకాశం ఉండడంతో, కొనుగోలు చేసే వారు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: May 05 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్ ను గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *