అక్షరటుడే వెబ్‌డెస్క్: ICICI Life Partner Stack | అడ్వైజర్లు, డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల డిజిటల్ సామర్థ్యాలను మరింత పెంచే లక్ష్యంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐసీఐసీఐ లైఫ్ పార్ట్‌నర్ స్టాక్ 2.0’ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ ( AI )ఆధారిత టూల్స్, సిస్టమ్స్ మధ్య మెరుగైన అనుసంధానం, సేల్స్ , కస్టమర్ సర్వీసింగ్‌కు ఉపయోగపడే అధునాతన డిజిటల్ సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చిన ‘ఈకోట్’ (eQuote) యాప్ ద్వారా కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ సాయంతో సరైన ప్రోడక్ట్ సిఫార్సులు చేయవచ్చు. అలాగే వ్యక్తిగతీకరించిన కొటేషన్లను సులభంగా జనరేట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఇక ‘లివా’ (LIVA) అనే ఏఐ చాట్‌బాట్ సహాయంతో అడ్వైజర్లు కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో ప్రోడక్ట్ ఫీచర్లు, కొటేషన్లను క్షణాల్లో యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ICICI Life Partner Stack | వేగవంతమైన ఆన్‌బోర్డింగ్..
యూఐడీఏఐ, సీకేవైసీ, వాహన్, జీఎస్‌టీఎన్, ఈపీఎఫ్‌వో, పెర్ఫియోస్ వంటి పలు జాతీయ డేటాబేస్‌లతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానం చేశారు. దీనివల్ల అప్లికేషన్ ఫారంలో దాదాపు 70 శాతం సమాచారం ముందుగానే ఆటోమేటిక్‌గా నిండుతుంది (ప్రీ-ఫిల్). ఫలితంగా కేవైసీ, ఆదాయ పత్రాలను సేకరించి అప్‌లోడ్ చేసే భారం తగ్గి, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ చాలా సులభంగా మారుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఏఎస్‌బీఏ (ASBA), వాట్సాప్ పేమెంట్స్ ద్వారా కస్టమర్లు బహుళ విధానాల్లో ప్రీమియం చెల్లించే సదుపాయం ఉంది. వీడియో వెరిఫికేషన్ ద్వారా రిస్క్ , ఫ్రాడ్‌లను అరికడుతూ అండర్‌రైటింగ్ వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేశారు.
ICICI Life Partner Stack | ముఖ్య ఉద్దేశం..
ఈ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమీష్ బ్యాంకర్ మాట్లాడుతూ.. అడ్వైజర్లు, భాగస్వాములకు డిజిటల్, ఏఐ సాధనాలను అందించడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలను మరింత సరళతరం చేయడమే ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దీనివల్ల భాగస్వాములు మరింత వేగంగా, నాణ్యమైన సేవలను కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ డిజిటల్ విస్తృతిలో భాగంగా ఇప్పటికే 200కు పైగా పార్ట్‌నర్-సిస్టమ్ ఇంటిగ్రేషన్లు ఉండగా, 99 శాతం బిజినెస్ అప్లికేషన్లు డిజిటల్‌గానే అందుకోబడుతున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2.7 కోట్లకు పైగా డిజిటల్ సర్వీస్ ఇంటరాక్షన్స్ నమోదు కాగా, 54 శాతం సేవింగ్స్ పాలసీలు దరఖాస్తు చేసిన రోజే జారీ అయ్యాయి. నాన్-ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్స్ పరిష్కారంలో సగటున ఒకే ఒక్క రోజు టర్నెరౌండ్ సమయంతో పరిశ్రమలోనే అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని కంపెనీ సాధించింది.
ఇది కూడా చదవండి: Bathukamma Filmmakers Challenge | బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్.. రూ.3 లక్షల బహుమతి