అక్షరటుడే, వెబ్‌డెస్క్: KBR Park One Way | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ నెల 18 నుంచి వన్‌వే అమలు చేయనున్నారు. అండర్‌పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
కేబీఆర్ పార్క్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చెట్లు తొలగించారు. త్వరలో పనులు మొదలు పెట్టనున్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వన్ వే అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఒకే మార్గంలో వాహనాలను అనుమతిస్తారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు ఏర్పాట్లు చేశారు. గతంలో పలుమార్లు వన్ వేపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
KBR Park One Way | పోలీసుల ఏర్పాట్లు
చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు రెండు వైపులా ట్రాఫిక్‌కు అనుమతి ఉంటుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ రెండు లైన్ల రోడ్లలో ఒకే వైపుగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. వన్ వే అమలుకు అనుగుణంగా ఇప్పటికే ట్రాఫిక్ జాయింట్ సీపీ, అధికారులు ఏర్పాట్లు చేయించారు. నగర సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ఒకటి, రెండు ఆదివారాలు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు చేశారు. ఆ సమయంలో వాహనదారుల ఇబ్బందులను పోలీసులు గమనించారు. వాటిని పరిష్కరించి, ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..: RTC Mechanic Death | బస్సు రిపేర్ చేస్తుండగా ప్రమాదం.. ఆర్టీసీ మెకానిక్ మృతి