Stock Market Losses | నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకులకు లోనై చివరికి నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్లు కోల్పోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండడం, అమెరికా -ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు సన్నగిల్లడంతో ముడి చమురు ధరలు వారం రోజుల గరిష్ట స్థాయికి చేరాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది. ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ సూచీలను పడేశాయి.

Stock Market Losses | స్వల్ప నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 461 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 147 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 388 పాయింట్ల నష్టంతో 78,154 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 24,471 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,033 కంపెనీలు లాభపడగా 2,279 స్టాక్స్ నష్టపోయాయి. 198 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 185 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 88 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 5 స్టాక్ లాభపడగా.. 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 2.01 శాతం, ఇన్ఫోసిస్ 0.46 శాతం, టైటాన్ 0.33 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.29 శాతం, టీసీఎస్ 0.25 శాతం లాభపడ్డాయి.

Top Losers : అల్ట్రాటెక్ సిమెంట్ 2.75 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.52 శాతం, ఇండిగో 1.50 శాతం, ఎయిర్‌టెల్ 1.44 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.04 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Shiprocket IPO | ఐపీవోకు షిప్ రాకెట్.. ఊరిస్తున్న జీఎంపీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *