Mahesh Goud Arrest | పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ అరెస్ట్

పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. లోక్​ భవన్​ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahesh Goud Arrest | పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. లోక్​ భవన్​ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

నీట్​ పేపర్​ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్​ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్​లోని లోక్​ భవన్​ వద్ద ఆందోళన చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Mahesh Goud Arrest | ధర్మేంద్ర ప్రధాన్​ను తొలగించాలి

మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ ‘చలో లోక్ భవన్’ ప్రదర్శన లోక్ భవన్‌కు చేరుకుంది. ఏఐసీసీ అగ్రనేతలపై పోలీసుల చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను భర్తరప్​ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Bandi Sanjay Comments | డ్రామాలు కట్టిపెట్టి చర్చకు రండి.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *