అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Poland Protests | పోలాండ్‌లో భారీ ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్డుపైకి వస్తున్నారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) అర్ధరాత్రి వేళ వార్సాలోని రాజ్యాంగ ట్రిబ్యునల్ భవనంపై దాడి చేయడానికి పోలీసులను పంపారని పలువురు ఆరోపించారు.
పోలాండ్ రాజ్యాంగ ట్రిబ్యునల్ వెబ్‌సైట్‌లో శుక్రవారం సాయంత్రం కనిపించిన ఓ ప్రకటన ఆందోళనకు కారణమైంది. కోర్టు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని సస్పెండ్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ అధ్యక్షుడు బోగ్డాన్ స్వియెజ్‌కోవ్‌స్కీ, ఉపాధ్యక్షుడు బార్ట్‌లోమియ్ సోచాన్స్కీలకు సంబంధించిన ప్రకటన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కోర్టు వెబ్‌సైట్‌లో కనిపించింది. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్‌రోకీ విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. అంతేగాకుండా రాజ్యాంగ ట్రిబ్యునల్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రధాని పోలీసులను ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు ట్రిబ్యునల్ భవనాన్ని చుట్టుముట్టారు.
Poland Protests | నియంత్రణలోకి తీసుకోవడానికి..
ఈ విషయం తెలియగానే పోలాండ్ అధ్యక్షుడు తన విమానాన్ని గాలిలోనే వెనక్కి తిప్పారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పోలాండ్‌కు హుటాహుటిన బయలుదేరారు. ప్రధాని డోనాల్డ్ టస్క్ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తూ, పోలాండ్ రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తూ, మరో ప్రభుత్వ సంస్థను చట్టవిరుద్ధంగా తన నియంత్రణలోకి తీసుకోవడానికి తన శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని నిరసనకారులు ఆరోపించారు. డోనాల్డ్ టస్క్ జర్మనీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, పోలాండ్ ప్రజల ప్రయోజనాల కోసం కాదన్నారు. యూరోపియన్ అనుకూల ప్రభుత్వం న్యాయస్థానం అధ్యక్షుడిని అన్యాయంగా తొలగించిందని ప్రజలు నిరసన తెలుపుతున్నారు. శనివారం తెల్లవారుజామున అధ్యక్షుడు భవనంలోకి ప్రవేశించారని నవ్‌రోకీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
ఇది కూడా చదవండి..: Israel Election Results | ఇజ్రాయెల్‌లో నెతన్యాహు కూటమి ముందంజ.. మెజారిటీకి మాత్రం దూరం..