Gadpotaram Gas Leak | గడ్డపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్​ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gadpotaram Gas Leak | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

ఈ ఘటనలో కార్మికులు సుదర్శన్‌ రావు (27), బాలాజీ (44) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్యాస్​ లీక్​కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితు కుటంబ సభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.

Gadpotaram Gas Leak | ప్రభుత్వ నిర్లక్ష్యంతో..

గ్యాస్​ లీక్​ ఘటనపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్​ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నారు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Bhupalpally ACB Case | పనులు చేయండి.. బిల్లులు పెట్టండి.. పావు వంతు మాకు ముట్టజెప్పండి!.. ఈ అవినీతి తిమింగళాల రూటే వేరు!

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *