Future City Cancellation | ఫ్యూచర్​ సిటీ రద్దు చేస్తాం.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Future City Cancellation | మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్​ సిటీని రద్దు చేస్తామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్​ఎస్​ (BRS) అధికారంలో ఉన్న సమయంలో ఫార్మాసిటీ కోసం 16వేల ఎకరాలు భూసేకరణ చేసి ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్ తెచ్చామని హరీశ్​రావు గుర్తు చేశారు. ఆ భూమిని ఫార్మాసిటీ కాకుండా వేరే అంశాల కోసం వాడితే.. రైతుల భూమి వెనక్కి ఇచ్చేయాలని చట్టం చెబుతోందన్నారు. మొన్న హైకోర్టులో కేసు విచారణకు వస్తే.. తాము ఫార్మా సిటీ రద్దు చేయడంలేదని ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందన్నారు.

Future City Cancellation | రియల్​ ఎస్టేట్​ దందా

ఫార్మా సిటీ (Pharma City)ని కొనసాగిస్తామని కోర్టుకు చెబుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని హరీశ్​రావు విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరిట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని ఆరోపించారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తామని పేర్కొన్నారు. అక్కడ 75 శాతం ఫార్మాసిటీ.. 25శాతం మిగతావి ఉండాలని చూసినట్లు హరీశ్​రావు తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం 75శాతం వ్యాపారం, 25 శాతమే ఫార్మా సిటీ ఉండేలా చేస్తుందని విమర్శించారు. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం.. కేటీఆర్​ ఆగ్రహం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *