PURE EV Fire Accident | ఈవీ స్కూటీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PURE EV Fire Accident | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) కంది మండలంలోని ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కంది మండలంలోని ప్యూర్‌ ఈవీ ఎలక్ట్రిక్‌ స్కూటీల కంపెనీ ఉంది. తెల్లవారుజామున కంపెనీ ప్రాంగణంలో మంటలు అంటుకున్నాయి. అనంతరం వేగంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్​లతో మంటలు ఆర్పి వేశారు.

PURE EV Fire Accident | భారీగా ఆస్తి నష్టం

విద్యుత్ స్కూటీల పరిశ్రమలో ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. .కోటికి పైగా నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: SDRF Personnel Rescue | గల్లంతైన వారిలో 10 మంది ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సురక్షితం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *