అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. ఈ ఫలితాలపై భారత రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్‌లాగే ప్రధాని మోదీ సైతం వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని విపక్షాలు వ్యాఖ్యానించగా.. బీజేపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు.
అమెరికా (America) మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు రెండు సభల్లోనూ విజయం సాధించడాన్ని ప్రతిపక్ష నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఏఐఎంఐఎం (AIMIM) పార్టీలు, అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తులకు వ్యతిరేకంగా వస్తున్న వ్యతిరేకతను సూచిస్తున్నాయని పేర్కొన్నాయి. బీజేపీ ఈ వాదనలను కొట్టిపారేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ స్థానం సుస్థిరంగా ఉందని స్పష్టం చేసింది.
US Midterm Elections | ఇక్కడ భారత ట్రంప్..
కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా మాట్లాడుతూ అమెరికాలో ఆయన ‘అమెరికా మోదీ’ అయితే, ఇక్కడ ఉన్నాయన ‘భారతదేశ ట్రంప్’. అక్కడ ఏం జరిగిందో, ఇక్కడ కూడా అదే జరగబోతోందన్నారు. ఎన్నికల ద్వారా ఆయన కూడా పదవి నుంచి దిగిపోతారని పేర్కొన్నారు. ఇటీవల ఆప్ నుంచి కాంగ్రెస్ చేరిన ప్రియాంక కక్కర్ “ఈరోజు అమెరికా అధ్యక్షుడు (POTUS), రేపు కమలం (LOTUS)” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మార్పు గాలి వీస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షులు రావచ్చు, పోవచ్చు కానీ ‘కమలం’ మాత్రం అలాగే ఉంటుందని, ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Civil Disputes | సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు