అక్షరటుడే, వెబ్డెస్క్: Civil Disputes | సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ పార్టీల మధ్య పౌర వివాదాలలో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలతో పాటు ఇతర అంశాలను పరిశీలించడానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదు చేయాలని ఆదేశించింది.
పౌర హక్కులను నిర్ణయించడానికి, పౌర వివాదాలను పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లను వేదికలుగా ఉపయోగించొద్దని జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతి భూషణ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆస్తి, స్వాధీనం, ఒప్పంద బాధ్యతలు లేదా ఇతర పౌర వివాదాలను పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్ను వేదికగా ఉపయోగించొద్దని పేర్కొంది. పోలీసులు తమ అధికార పరిధిలోనే పని చేయాలని సూచించింది. పోలీస్ స్టేషన్ లోపల సిబ్బంది అటువంటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
Civil Disputes | న్యాయవాదుల హత్యల నేపథ్యంలో..
కర్ణాటకలో ఇటీవల న్యాయవాదులు శ్రీరామ్, మంజునాథ్ హత్యకు గురయ్యారు. సీనియర్ న్యాయవాది వెంకటరామణప్పపై హత్యాయత్నం జరిగింది. దీంతో బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ (AAB), కర్ణాటక స్టేట్ బార్ కౌన్సిల్ (KSBC) హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా ప్రైవేట్ పార్టీల మధ్య జరిగే సివిల్ వివాదాలలో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుంటున్నారని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి తీవ్రమైన పరిశీలన అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సివిల్ వివాదాలను పోలీస్ స్టేషన్లు స్వీకరించకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిన ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Pre-Children’s Day 2026 | ప్రాజెక్ట్ వికసిత్ భారత్ 2047..ఢిల్లీలో ఘనంగా ‘మాదర్స్ అడ్వకేటింగ్ వాల్యూస్’ ప్రీ-చిల్డ్రన్స్ డే వేడుకలు