అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CP Suspended | కేరళ (Kerala)లో జడ్జి కుమారుడు కారుతో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా పోలీస్ కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
త్రిస్సూర్‌లోని కోర్టు జడ్జి 17 ఏళ్ల కుమారుడు ఇటీవల రాత్రి సమయంలో తన తండ్రికి చెందిన బెంజ్ కారును అతివేగంగా నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని మంజలి ప్రాంతానికి చెందిన జయబాలకృష్ణన్గా గుర్తించారు. అయితే నిందితుడు జడ్జి కుమారుడు కావడంతో పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపిన ఆ బాలుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొచ్చి పోలీస్ చీఫ్ కళిరాజ్ మహేష్‌ను తన పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఆర్. నిశాంతినిని నియమించారు.
CP Suspended | విమర్శలు రావడంతో..
జడ్జి కుమారుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఆ వ్యక్తి మృతికి కారణం అయ్యాడు. అతడు నిత్యం డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీసేవాడు. అయితే పోలీసులు మాత్రం తన తల్లిదండ్రులకు తెలియకుండా బాలుడు మొదటి సారి కారు తెచ్చాడని పేర్కొన్నారు. అంతేగాకుండా బాలుడి ఫోన్లో నుంచి వీడియోలను డిలీట్ చేశారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు కారు అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు చూపించే ఫుటేజీని కూడా దర్యాప్తు అధికారులు అతని మొబైల్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కేసును నీరుగార్చేందుకు జడ్జి అయిన బాలుడి తండ్రి ప్రయత్నించారని బాధితుడి కుటుంబం ఆరోపించింది. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో పక్షపాతంగా వ్యవహరించినందుకు కమిషనర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇది కూడా చదవండి..: Train Charging Rules | రాత్రివేళ ఫోన్ ఛార్జింగ్‌పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం