Firecracker Shops | పటాకుల దుకాణాల నిర్వాహకులు అనుమతి తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య

దీపావళి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో తాత్కాలిక పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Firecracker Shops | దీపావళి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో తాత్కాలిక పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

Firecracker Shops | డివిజనల్​ పోలీస్​ అధికారి కార్యాలయంలో..

పటాకుల దుకాణాలు నిర్వహించాలనుకునే వారు డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సీపీ తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలన్నారు. అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారిపై ఎక్స్​ప్లోజివ్ యాక్ట్​-1884, రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Firecracker Shops | నిబంధనలు పాటించాలి

పటాకుల దుకాణాలను ఖాళీ ప్రదేశాల్లోనే నెలకొల్పాలని సీపీ సూచించారు. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్​వోసీ సర్టిఫికెట్​ పొందుపర్చాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదని..అలాగే రద్దీగల ప్రదేశాలలో ఎలాంటి పటాకుల షాపులు ఏర్పాటు చేయరాదన్నారు. అదేవిధంగా కళ్యాణ మండపాల్లో, సమావేశాల కేంద్రాలలో దుకాణాలు పెట్టవద్దని పేర్కొన్నారు. తాత్కాలిక పటాకుల దుకాణాలలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Manjeera River Deaths | మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్లు మృతి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *