Manjeera River Deaths | మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్లు మృతి..

మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్ల ఘటన చివరకు విషాదాంతమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Manjeera River Deaths | మంజీర నదిలో గల్లంతైన తల్లీకూతుళ్ల ఘటన చివరకు విషాదాంతమైంది. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్​ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు మెదక్​ జిల్లా మంజీర నదిలో దూకి చనిపోయారు.

Manjeera River Deaths | మల్కాపూర్​కు చెంది…

మెదక్​ జిల్లా (Medak district) కొల్చారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (30) హైదరాబాద్​లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డులో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (8), సంగిక (6) ఉన్నారు. ఆధార్​లో మార్పులు చేయించుకునేందుకు ఆమె తన ఇద్దరు కుమార్తెలతో మల్కాపూర్​కు వచ్చింది. కాని ఏం జరిగిందో తెలయదు కాని.. 26వ తేదీన ఇంట్లో నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులోని ఏడుపాయల మొదటి వంతెన సమీపంలో నదిలోకి పిల్లలతో దూకినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆమె సెల్​ఫోన్​, చెప్పులను పోలీసులు గుర్తించారు. అప్పటికే తాను పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబీలకు ఫోన్​లో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు చిన్నారుల్లో వైష్ణవి ఐదో తరగతి, సంగిక నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతితో మల్కాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి..: Gandhari Woman Death | గేదె విషయంలో గొడవ.. ఆపేందుకు వెళ్లిన మహిళ మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *