Crude Oil Prices | తగ్గని చమురు ధరలు.. నష్టాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 454 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Prices | సౌదీలో రోజుకు 5.50 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ఓ రిఫైనరీపై దాడి చేసినట్లు హూతీలు ప్రకటించారు. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు దాటింది. కొంతకాలంగా చమురు ధరలు గరిష్టాల వద్ద కొనసాగుతుండడంతో మార్కెట్‌లో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి. దీనికితోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి.

Crude Oil Prices | ఐటీ స్టాక్స్‌లో పతనం..

ఐటీ స్టాక్స్ సెల్లాఫ్‌కు గురవుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ వంటి షేర్లు భారీగా పడిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ఇతర మార్కెట్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రధానంగా దక్షిణకొరియా, తైవాన్ మార్కెట్లు విశేషంగా రాణిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా దేశీయ సంప్రదాయ ఐటీ కంపెనీలు మాత్రం నష్టాల బాటలో పయనిస్తూ ప్రధాన సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.50 శాతానికిపైగా నష్టంతో ఉంది. ఫార్మా, ఆటో రంగాల షేర్లు రాణిస్తున్నాయి.

Crude Oil Prices | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 345పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైనా.. మొదట్లో కోలుకుని 163 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితోత ఇంట్రాడే గరిష్టాలనుంచి 713 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 13 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 194 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో నష్టాలు కాస్త తగ్గాయి. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 454 పాయింట్ల నష్టంతో 73,144 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 22,653 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 9 స్టాక్స్ లాభాలతో, 21 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎల్టీ 3.72 శాతం, ట్రెంట్ 1.10 శాతం, ఎస్బీఐ 1.09 శాతం, ఇండిగో 0.71 శాతం, ఎం అండ్ ఎం 0.47 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 3..88 శాతం, టీసీఎస్ 2.40 శాతం, రిలయన్స్ 2.26 శాతం, టెక్ మహీంద్రా 2.01 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.78 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Jio Platforms Listing | స్టాక్ మార్కెట్‌లో రెండో అతిపెద్ద కంపెనీ!.. జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌పై భారీ అంచనాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *