అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gujarat Drug Seizure | గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్‌లో అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ. 25.5 కోట్ల విలువైన హెరాయిన్, మెఫెడ్రోన్ పట్టుకున్నారు.
అహ్మదాబాద్, సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి భారీ ఆపరేషన్ చేపట్టింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న CTM టోల్ ప్లాజా సమీపంలో ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ సిండికేట్‌ను అడ్డగించింది. వారి నుంచి రూ25.65 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ భారీ సరుకును గుజరాత్‌లోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న ఢిల్లీ, మీరట్‌కు చెందిన ముగ్గురు పెడ్లర్లను అరెస్టు చేశారు.
Gujarat Drug Seizure | పక్కా సమాచారం మేరకు..
ఇతర రాష్ట్రాల నుంచి గుజరాత్‌లోకి భారీగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేనపట్టారు. టోల్ ప్లాజా భారీగా మోహరించిన పోలీసులు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో నిందితుల వాహనంను ఆపి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2,497.49 గ్రాముల మెఫెడ్రోన్ సీజ్ చేశారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. రూ.22.65 కోట్ల విలువైన 4,531.22 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Gujarat Drug Seizure | నిందితులు వీరే..
నిందితులపై గతంలో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాల స్మగ్లింగ్, పెరోల్ జంపింగ్, మానవ అక్రమ రవాణా ఆరోపణలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అరెస్టయిన వారిని టిఫెల్ నోఖేజ్ (న్యూఢిల్లీ), కాఫిల్ అహ్మద్ (న్యూఢిల్లీ), మహ్మద్ ఇమ్రాన్ అల్వి (మీరట్)గా గుర్తించారు.
ఇది కూడా చదవండి..: India-US Trade Deal | భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు