అక్షరటుడే, వెబ్డెస్క్: Farmer Loan Waiver | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Tamilnadu CM Vijay) మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రూ.75,000 వరకు గల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 5,932 కోట్ల అదనపు భారం పడుతుందని విజయ్ తెలిపారు. అయితే ఇది రైతులకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ. 75,000 కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ. 35,000 వరకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
Farmer Loan Waiver | రైతుల విన్నపం మేరకు

సన్న, చిన్నకారు రైతులు సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ. 50,000 వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతుల విజ్ఞప్తి మేరకు తాజాగా ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచింది. రాబోయే సాగు సీజన్ కోసం రుణాలు పొందాలనుకునే రైతులకు ఈ పంట రుణ మాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని విజయ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Monsoon Preparedness | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్