జాతీయంDead body in Train | రైలులో మహిళ మృతదేహం కలకలం

Dead body in Train | రైలులో మహిళ మృతదేహం కలకలం

మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేసి రైలులో పెట్టారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లో వెలుగు చూసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dead body in Train | రైలులో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)​లో చోటు చేసుకుంది. మహిళ మృతదేహాన్ని ముక్కులుగా చేసి బ్యాగ్​, పెట్టెలో పెట్టి రైలులో వదిలి వెళ్లారు.

లక్నో రైల్వే SP రోహిత్ మిశ్రా (SP Rohit Mishra) తెలిపిన వివరాల ప్రకారం.. ఛప్రా నుంచి గోరఖ్‌పూర్ మీదుగా గోమతి నగర్ వెళ్లే ఒక రైలులో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్లీపర్ కోచ్‌లో వారికి ఒక పెట్టె, బ్యాగ్ కనిపించాయి. వెంటనే వారు స్టేషన్ మాస్టర్‌ (Station Master)కు సమాచారం అందించారు. ఆయన ఆర్పీఎఫ్​, జీఆర్​పీ అధికారులకు తెలియజేశారు.

Dead body in Train | తెరిచి చూడగా షాక్​

అధికారులు ఆ పెట్టె, బ్యాగ్​ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిచి చూడగా.. మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉంది. తల లేకుండా మొండెం మాత్రమే ఉండటం గమనార్హం. శరీర అవయవాలను వేర్వేరు పాలిథీన్ సంచులలో ప్యాక్ చేసి ఆ బ్యాగ్‌లో ఉంచారు. సుమారు 25 నుండి 30 ఏళ్ల వయసున్న మహిళదిగా భావిస్తున్న ఈ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. తల దొరకకపోవడంతో మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాటిని ఎవరు పెట్టారో గుర్తించడానికి రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీని, ప్రయాణికుల రిజర్వేషన్ వివరాలను పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Tamil Nadu Road Accident | మధురైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...