Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్​.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shamshabad Road Accident | రంగారెడ్డి జిల్లా (Rangareddy district) శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవి అనే యువతి దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్​ నగరంలోని నారాయణగూడలో బంధువుల ఇంటికి వెళ్లింది.

సెలవులు ముగియడంతో ఆమెను తండ్రి ఇంటికి తీసుకు వెళ్లడానికి వచ్చాడు. ఇద్దరు కలిసి బైక్​పై వెళ్తుండా.. శంషాబాద్​లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీరి బైక్​ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా.. దేవికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shamshabad Road Accident | ఉప్పల్​లో కారు బీభత్సం

హైదరాబాద్‌ ఉప్పల్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ముందున్న కారు పల్టీలు కొడుతూ వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఆ స్తంభం విరిగి కారుపై పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది కూడా చదవండి..: TG Safe Food Raids | టీజీ సేఫ్​ అధికారుల దాడులు.. 55 టన్నుల ఆహార పదార్థాల సీజ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *