Mobile Anganwadi Centers | మొబైల్​ అంగన్​వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

మొబైల్ అంగన్​వాడీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mobile Anganwadi Centers | చిన్నారులే దేశ సంపద అని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

ఏ ఒక్క చిన్నారికీ అంగన్​వాడీ సేవలకు దూరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్​వాడీ కేంద్రాలను ప్రారంభిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఎంసీఆర్​హెచ్‌ఆర్‌డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్​వాడీ వాహనాన్ని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ వాహనం మేడ్చల్ జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో అంగన్​వాడీ సేవలు అందించనుంది.

Mobile Anganwadi Centers | అంగన్​వాడీ కేంద్రాలు లేనిచోట్ల..

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లి శిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవన్నారు. అయితే అంగన్​వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ముఖ్యంగా పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసం మొబైల్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

Mobile Anganwadi Centers | వలస కార్మికులు ఉండే ప్రాంతాల్లో..

Mobile Anganwadi Centers

పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల పర్యవేక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లి శిశు సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలను ఈ వాహనాల ద్వారా అందిస్తామని మంత్రి వెల్లడించారు. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు ఈ మొబైల్ వాహనాలు నేరుగా వెళ్లి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ఒక్కో వాహనం దాదాపు పది అంగన్​వాడీ కేంద్రాలకు సమానంగా సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఒక్కో మొబైల్ అంగన్వాడి కేంద్రం ద్వారా సుమారు 300 మంది లబ్ధిదారులకు సేవలు అందనున్నాయని మంత్రి సీతక్క తెలిపారు.

ఇది కూడా చదవండి..: Retired Teacher Suicide | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *