Enumeration Process Kamareddy | ఎస్​ఐఆర్​ ప్రక్రియ సజావుగా సాగడం లేదు : బీఆర్ఎస్ ఆరోపణ

కామారెడ్డిలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగడం లేదని మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Enumeration Process Kamareddy | కామారెడ్డి (Kamareddy)లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగడం లేదని మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు.

Enumeration Process Kamareddy | ఫారాల పంపిణీలో తీవ్ర జాప్యం

ఆమె మాట్లాడుతూ కామారెడ్డిలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో తీవ్ర జాప్యం ఎదురవుతుందన్నారు. 99 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందనేది అవాస్తవమని, ఇప్పటికి సగం మందికి కూడా ఫారాలు అందలేదని తెలిపారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి తిరిగి ఫారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు ప్రజలను కలవడం లేదని, ఫారం నింపడంలో సహకరించడం లేదని, నచ్చిన చోట కూర్చుని పని చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 14 రోజులు పూర్తయిందని, సమయం తక్కువగా ఉండటంతో అధికారులు వెంటనే చొరవ తీసుకుని అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.

Enumeration Process Kamareddy

దొంగ ఓట్లు ఉండకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, కామారెడ్డిలో దొంగ ఓట్లతో కొంతమంది కౌన్సిలర్ల ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని ఆమె గుర్తుచేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, జులై 24 లోపు ప్రక్రియ పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇంటికి పిలిచి బెదిరించి రాయిస్తున్నట్టు సమాచారం ఉందని, ఇలాంటివి జరగకుండా కట్టడి చేయాలని కోరారు.  బీఆర్ఎస్ తమ బీఎల్‌ఏల జాబితాను ఇచ్చామని, బీఎల్‌ఓలు బీఎల్‌ఏలను కలుపుకుని వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కో అప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, కౌన్సిలర్లు హఫీజ్, మహమ్మద్ మన్సూర్, మామిండ్ల లక్ష్మణ్, ఎజాజ్, నర్సింలు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బల్వంత్ రావు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Municipal Workers Safety | మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *