RTC Strike Nizamabad | నిజామాబాద్​లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: RTC Strike Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC strike) ప్రశాంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. జేఏసీ నాయకులు బస్సులు బయటకు రాకుండా డిపో ముందే భైఠాయించారు.

RTC Strike Nizamabad | సమస్యల పరిష్కారం కోసం సమ్మె

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ (TSRTC protest) విలీనం తప్ప మిగతా సమస్యలన్నీ పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయన్నారు. తమ ప్రతిపాదనలను ప్రభుత్వం నిరాకరించడంతో సమ్మె అనివార్యమైందని వారు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నినాదాలు చేస్తూ బస్సులు బయటకు రాకుండా చూశారు. కేవలం ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే బస్సులు బస్టాండ్​లోకి వచ్చి వెళ్తున్నాయి.

RTC Strike Nizamabad | నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్ రీజియన్​ (Nizamabad RTC Region) పరిధిలోని ఆరు డిపోల పరిధిలో (public transport) రోజూ సగటున 700 బస్సులు 3,200 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ లెక్కన సుమారు రోజుకు రూ.68 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు నష్టం వస్తుంది. సమ్మెతో మరోవైపు పార్సిల్స్, కొరియర్ సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.

ఇది కూడా చదవండి:Bengaluru Murder Case | ప్రపోజ్​ చేస్తానని ప్రాణం తీసిన ప్రియురాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *