Telangana Voter List | SIR ప్రక్రియలో అక్రమాలు.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026) ప్రక్రియపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Voter List | తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026) ప్రక్రియపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అధికార కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై బూత్ లెవల్ అధికారులను (BLO) తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయని, ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ నేతలు సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ‘SIR 2026’ ప్రక్రియ సజావుగా సాగడం లేదని, ఎన్నికల కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Telangana Voter List | ఎంఐఎం ఆధ్వర్యంలో అక్రమ క్యాంపులు..

హైదరాబాద్ పాతబస్తీలో బీఎల్ఓలు ఇళ్లకు వెళ్లి ఫారాలు పంపిణీ చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, దానికి బదులుగా ఎంఐఎం నాయకులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి బల్క్‌గా ఫారాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. నింపిన ఫారాలను అప్‌లోడ్ చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం (ECI) యాప్ యాక్సెస్‌ను కూడా ఎంఐఎం నేతలకు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ramchander rao.1

Telangana Voter List | ఓటర్ల ఇబ్బందులు..

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చాలా మంది ఓటర్లకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉండటంతో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ఓటర్లు ఇంట్లో లేకపోతే కనీసం మూడు సార్లు బీఎల్ఓలు వారి ఇంటిని సందర్శించడం తప్పనిసరి చేయాలని బీజేపీ నేతలు కోరారు.

Telangana Voter List | భాషా పరమైన ఇబ్బందులు..

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారు తెలుగులో ఫారాలు నింపడానికి ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో ఫారాలను అందుబాటులో ఉంచాలని విన్నవించారు.

ఇది కూడా చదవండి:  Mobile Anganwadi Centers | మొబైల్​ అంగన్​వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *