అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TG Safe Food Raids | కల్తీ ఆహార పదార్థాలపై టీజీ సేఫ్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కాటేదాన్ సమీపంలో గల ప్రేమవతిపేటలో ఉన్న సాహిల్ ఫుడ్స్‌కు చెందిన ఐదు తయారీ యూనిట్ల తాజాగా అధికారులు సోదాలు చేశారు.
ఆయా కేంద్రాల్లో పరిశుభ్రత పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. లైసెన్సింగ్, నాణ్యత-నియంత్రణ ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత అధికారులు రూ.33.94 లక్షల విలువైన, తప్పుగా లేబుల్ వేసిన 55 టన్నుల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు యూనిట్లలో కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.
TG Safe Food Raids | గుట్కా నములుతూ..
కల్తీ జరిగినట్లు అనుమానంతో రూ.33,94,115 విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, టెస్టింగ్ కోసం 11 శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. ఆహార పదార్థాల తయారీ కేంద్రంలో పరిశుభ్రత లోపించడం, నిల్వలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. దుమ్ముతో, పొగతో నిండిన యంత్రాలు, ఉత్పత్తి కన్వేయర్లలో ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, తగినంత వెంటిలేషన్ లేకపోవడం, వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అందులో పని చేసే కార్మికులు గుట్కా, పాన్ మసాలా నములుతూ అధికారులకు దొరికారు.
దీనిని కూడా చదవండి : Mysore Dasara Festival | మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి